Chittoor: చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ఘోరం: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య!

Chittoor: చిత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఒక గుర్తుతెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 5 July 2026 12:52 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ఘోరం: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య!

చిత్తూర్: ఈ రోజు 05.07.2026 ఉదయం సుమారు 09:55 గంటలకు, చిత్తూరు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నెం.1 నుండి తిరుపతి వైపు సుమారు 100 మీటర్ల దూరంలో, ఒక గుర్తుతెలియని మహిళ (వయస్సు సుమారు 40 సంవత్సరాలు) రైల్వే ట్రాక్‌పైకి ఆత్మహత్య చేసుకోవుటకు తిరుపతి వైపునకు వెళ్తున్న రైలు నెం.16854 (తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) కు అడ్డం గా వెళ్లగా, రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

సంఘటన స్థలంలో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేదా ఇతర వస్తువులు లభించలేదు. మృతదేహాన్ని గుర్తింపు కోసం చిత్తూరు ప్రభుత్వ మార్చురీ హాలులో భద్రపరచడం జరిగింది.

మృతురాలి వివరాలు:

- వయస్సు : సుమారు (35 - 40) సంవత్సరాలు

- రంగు : తెలుపు (Fair Complexion)

- దుస్తులు : ముదురు గులాబీ (డార్క్ పింక్) రంగు చీర ధరించి ఉంది

- కుడి చేతిపై "మురళి" అనే పేరుతో పచ్చబొట్టు (టాటూ) ఉంది

పై వివరాలకు సరిపడే మహిళను ఎవరైనా గుర్తించినట్లయితే, దయచేసి వెంటనే జి.ఆర్.పీ. చిత్తూరు పోలీస్ స్టేషన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించగలరు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story