Chittoor: అనంతపురం సర్పంచ్ అభ్యర్థిగా ఆర్. విమలావతి నామినేషన్!

Chittoor: చిత్తూరు రూరల్ మండలం అనంతపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున ఆర్. విమలావతి శనివారం ఎన్.ఆర్.పేట సచివాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Chandra Sekhar, Chittoor
Updated on: 21 Nov 2026 3:40 PM IST
Chittoor
X

Chittoor: అనంతపురం సర్పంచ్ అభ్యర్థిగా ఆర్. విమలావతి నామినేషన్!

చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం అనంతపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆర్. విమలావతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఎన్.ఆర్.పేట సచివాలయంలో తన కుమారుడు ప్రవీణ్, ఇతర మద్దతుదారులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ఆర్. విమలావతి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తనకు అవకాశం కల్పించి మద్దతుగా నిలిచిన కూటమి నాయకులకు,పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతపురం పంచాయతీ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలు తనకు మద్దతుగా నిలిచి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆర్. విమలావతి విజ్ఞప్తి చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor