Chittoor: నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి: టీడీపీ నేత ప్రవీణ్
Chittoor: చిత్తూరు రూరల్ మండలం అనంతపురంలో P4 సేవా కార్యక్రమాలు చేస్తున్న తనపై మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేత ప్రవీణ్ ఆరోపించారు.
Chittoor: నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి: టీడీపీ నేత ప్రవీణ్
చిత్తూరు: నాపై దాడికి పాల్పడిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోండి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ అన్నారు. మంగళవారం చిత్తూరు రూరల్ మండలం అనంతపురంలో ఆయన గ్రామస్తులు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు P4 కార్యక్రమం కింద అనంతపురంలో తన సొంత నిధులతో వీధి దీపాలు దేవాలయ అభివృద్ధి ఇతర సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక మాజీ ఎంపీపీ జయచంద్ర నాయుడు మాజీ సర్పంచ్ శ్యామ్ తనపైన దాడికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదే విషయంపైన సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అయినప్పటికీ వీధి దీపాలు వేయడంతో విద్యుత్ శాఖ అధికారుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.




