Chittoor: చిత్తూరులో 1,000 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్
Chittoor: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చిత్తూరులో ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆధ్వర్యంలో 1,000 మంది పోలీసులతో 3 కిలోమీటర్ల భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Chittoor: చిత్తూరులో 1,000 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్
చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు చిత్తూరు పట్టణంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సుమారు 1,000 మంది పోలీసు సిబ్బంది, ఎస్టీఎఫ్ బలగాలు, వజ్రా వాహనంతో ఈ కవాతు చేపట్టారు.
చిత్తూరు గాంధీ కూడలి నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ చర్చి వీధి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, దర్గా కూడలి, ఎంఎస్‌ఆర్ కూడలి మీదుగా సాగి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ కవాతు కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడమే పోలీసుల లక్ష్యమన్నారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం, పోలింగ్‌కు ఆటంకం కలిగించడం, హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




