Chittoor: రోడ్డు ప్రమాద మృతిపై శవ రాజకీయాలు తగదు

Chittoor: కుప్పం వానగుట్టపల్లి రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త రాజేంద్ర మృతిపై వైసీపీ తీరును ఖండించిన బొజ్జల సుధీర్ రెడ్డి, షణ్ముగం; రూ.10 లక్షల సాయం.

Chandra Sekhar, Chittoor
Published on: 27 Nov 2026 11:28 PM IST
Chittoor
X

Chittoor: రోడ్డు ప్రమాద మృతిపై శవ రాజకీయాలు తగదు

చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలోని వానగుట్టపల్లిలో రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త రాజేంద్ర మృతి ఘటనను వైసీపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడం తగదని పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకుడు,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెక్కుడుకుప్పం షణ్ముగం విమర్శించారు.

శుక్రవారం చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై మృతుడి కుమారుడే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.

మృతుడిని వైసీపీ కార్యకర్తగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.మృతుడు రాజేంద్ర కుటుంబానికి టీడీపీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని,పార్టీ సభ్యత్వ బీమా పరిహారం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor