Chittoor: చిత్తూరు 32వ డివిజన్‌లో విస్తృతంగా టీడీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం!
Chittoor: చిత్తూరు 32వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల శంకర్ ఇంటింటి ప్రచారం. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.
Chittoor: చిత్తూరు 32వ డివిజన్‌లో విస్తృతంగా టీడీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం!
చిత్తూరు: నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల శంకర్ ఓటర్లను కోరారు. మంగళవారం డివిజన్ పరిధిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, నగర మేయర్ అభ్యర్థి కటారి హేమలతను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నేతృత్వంలో రహదారులు, తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంజుల శంకర్ తెలిపారు. డివిజన్‌లోని సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శంకర్, కుసుమ తదితరులు పాల్గొన్నారు.




