Chittoor: ప్రజలకు సేవ చేయడం తప్పా?- టీడీపీ నేత ప్రవీణ్ నాయుడు
Chittoor: చిత్తూరు రూరల్ మండలం అనంతాపురంలో టీడీపీ నేత ప్రవీణ్ నాయుడు విలేకరులతో మాట్లాడారు. పీ-4 స్ఫూర్తితో సేవ చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
Chittoor: ప్రజలకు సేవ చేయడం తప్పా?- టీడీపీ నేత ప్రవీణ్ నాయుడు
చిత్తూర్: గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని తమ మండలంలో తాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేయడం తప్పా ...? అంటూ చిత్తూరు రూరల్ మండలం అనంతాపురంకు చెందిన మండల టిడిపి సీనియర్ నాయకుడు ప్రవీణ్ నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం అనంతాపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
తాను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు వీరాభిమాని అన్నారు. తాను గతంలో పార్టీ యువ నేత నారా లోకేష్ నిర్వహించిన యువగళం కార్యక్రమంలో సైతం చురుగ్గా పాల్గొన్నానని పేర్కొన్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ఖజానాను పరిపుష్టి చేసి, ప్రజలకు విశిష్ట సేవలు అందించాలన్న దృక్పథంతో తమ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల పిలుపునిచ్చిన పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ ( పీ - 4 ) కు తాను ఆకర్షితులై స్వచ్ఛంద సేవ చేసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల తమ మండల పరిధిలో జరుగుతున్న దొంగతనాలు, హత్యలను




