Chittoor: చంద్రగిరి పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జా.. ఇళ్ల నిర్మాణాలు!

Chittoor: సి.మల్లవరం పరిధిలోని సర్వే నంబర్ 299 లో గల రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ చెరువు లోతట్టు భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 30 Jun 2026 9:23 PM IST
Chittoor
X

Chittoor: చంద్రగిరి పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జా.. ఇళ్ల నిర్మాణాలు!

Chittoor: చంద్రగిరి, పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలోని తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ కి సంబంధించిన గాంధీనగర్ సమీపంలో సర్వేనెంబర్ 299 లో విస్తీర్ణం ఎ1.21 సెంట్లు చెరువు లోతట్టు భూమి ఉంది.

గతంలో వైసిపి ప్రభుత్వ పాలనలో కూడా అప్పటి పాలకులు ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే కబ్జా చేయలేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఈ భూమిపై కన్నువేశారు.

అయితే ప్రస్తుతం పేరూరు గ్రామపంచాయతీకి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు చెరువు భూమిని కబ్జా చేశారు. భూమి విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఈ భూమిపై రెవెన్యూ అధికారులు స్పందించి భూ అక్రమాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story