Chittoor: చిత్తూరులో ఘనంగా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్ర పదవీ విరమణ!
Chittoor: చిత్తూరు జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం. రామచంద్ర పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ. 37 ఏళ్ల సేవలను కొనియాడిన డీఆర్ఓ మోహన్ కుమార్.
Chittoor: చిత్తూరులో ఘనంగా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్ర పదవీ విరమణ!
చిత్తూరు: చిత్తూరు జిల్లా ట్రెజరీ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ఎం. రామచంద్ర పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరులోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ట్రెజరీ శాఖ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని రామచంద్రకు ఘనంగా సన్మానం చేసి ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ మాట్లాడుతూ.. ఎం. రామచంద్ర 37 సంవత్సరాల పాటు ట్రెజరీ శాఖలో అంకితభావంతో సేవలందించడం అభినందనీయమన్నారు. ఉద్యోగ జీవితంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని ప్రశంసించారు.
పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో తిరుపతి జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీకర రెడ్డి, ఎస్ ఎస్ ఏ. పి ఓ. వెంకటరమణ అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు షేక్ ఖాదర్ వలీ, శివభారతి.




