Chittoor: న్యాయం చేయాలంటూ ప్రెస్ క్లబ్ ముందు బాధితుల నిరసన!
Chittoor: చిత్తూరులో ఫైనాన్స్ ఆటో విక్రయించి మోసం చేశారని, ప్రశ్నిస్తే ఆటోను పెట్రోలు పోసి తగలబెట్టారని బాధితులు ప్రెస్ మీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Chittoor: న్యాయం చేయాలంటూ ప్రెస్ క్లబ్ ముందు బాధితుల నిరసన!
Chittoor: చిత్తూరు ఫైనాన్స్ ఆటో ను తమకు విక్రయించి మోసం చేశారంటూ చిత్తూరు రూరల్ మండలం తుమ్మింద పాల్యంగ్రామానికి చెందిన నవనీత కుటుంబ సభ్యులు ఆరోపించారు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తవణంపల్లి మండలం పొన్నెడు పల్లి గ్రామానికి చెందిన రేణుక తమకు ఆటోను విక్రయించిందని తెలిపారు, అడ్వాన్స్ కింద 65వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని తర్వాత ఆటోను మేము తీసుకెళ్లామని తెలిపారు.
నెల రోజుల తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటోపై ఫైనాన్స్ ఉన్నదని పెండింగ్ డ్యూలు ఉన్నాయని ఆటోను తీసుకెళతామని చెప్పడంతో భయపడి ఆటోను పొలంలో భయపడి పొలంలో ఆటోను ఉంచడం జరిగిందన్నారు తమను అన్యాయంగా మోసం చేసిన రేణుక ఆటో మీకు తప్పకుండా చూస్తానని ఆసిఫ్ , ఫైనాన్స్ మనీ మరి కొంతమందిత కలిసి దౌర్జన్యంతో ఎవరు లేని సమయంలో ఆటోను పెట్రోలు పోసి కాల్చివేశారన్నారు.ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు.




