Chittoor: విజయం డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
Chittoor: చిత్తూరు విజయం సైన్స్ అండ్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గంగాధర నెల్లూరు ఎంపీడీవో మనోహర్ గౌడ్ హాజరయ్యారు.
Chittoor: విజయం డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
చిత్తూరు: స్థానిక విజయం సైన్స్ అండ్ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగతోత్సవం (ఫ్రెషర్స్ డే) వేడుకలు శనివారం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగాధర నెల్లూరు ఎంపీడీవో మనోహర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని,వాటి సాధన కోసం క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు.చదువుతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవడం ద్వారా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. ప్రపంచ విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధికి భారతీయ విజ్ఞానం అందించిన తోడ్పాటు ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
భౌతిక శాస్త్రం,గణిత శాస్త్రాల్లో భారతీయుల కృషి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.గణితంలో సున్నా, ఒకటి వంటి సంఖ్యల ప్రాముఖ్యతను వివరించారు.వెయ్యి సంవత్సరాల క్రితమే భారతీయులు భౌతిక, గణిత శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతమైన ఆలయ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.




