Chittoor: ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ డే ఎస్వీ ఫార్మసీ కాలేజ్ భారీ ర్యాలీ
Chittoor: చిత్తూరులో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు. ఎస్వీ ఫార్మసీ కాలేజ్ ఆధ్వర్యంలో కలెక్టర్ బంగ్లా నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థుల భారీ ర్యాలీ.
Chittoor: ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ డే ఎస్వీ ఫార్మసీ కాలేజ్ భారీ ర్యాలీ
చిత్తూరు: ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు.కలెక్టర్ బంగ్లా సమీపం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఫార్మసిస్ట్‌ల ప్రాధాన్యత, ప్రజారోగ్యంలో వారి పాత్రపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్స్ డి. జ్యోతిశ్వరి, సాయి రాజేష్ మాట్లాడుతూ వైద్యరంగంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
వైద్యులు చికిత్స అందించడంతో పాటు, రోగులకు అవసరమైన మందులను సరైన విధానంలో అందించడం, వాటి వినియోగంపై అవగాహన కల్పించడం ఫార్మసిస్టుల ముఖ్య బాధ్యతలని పేర్కొన్నారు. వ్యాధుల నియంత్రణలో మందులు ఎంతో కీలకమని, ఫార్మసిస్టుల సేవలను సమాజం గుర్తించి గౌరవించాలని కోరారు.
ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు సహకరించిన శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేతలు రావూరి శ్రీనివాసులు, రావూరి వెంకటస్వామికి, పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




