Chittoor: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి వైఎస్సార్‌సీపీ

Chittoor: చిత్తూరు కలెక్టరేట్‌లో వైఎస్సార్‌సీపీ ఆందోళన. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిఆర్వోకు వినతిపత్రం అందజేత.

Chandra Sekhar, Chittoor
Published on: 31 July 2026 8:58 PM IST
Chittoor
X

Chittoor: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి వైఎస్సార్‌సీపీ

చిత్తూరు: డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర, పారదర్శక సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు.

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్‌తో పాటు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన,విద్యార్థి విభాగాల నాయకులు కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వోకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ... డీఎస్సీ అక్రమాలపై అనేక ప్రశ్నలులేవనెత్తుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ ఈ అంశంపై సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు.

స్పోర్ట్స్ కోటా పేరుతో నిబంధనలను ఉల్లంఘించి,ఉద్యోగాల అమ్మకాలకు పాల్పడ్డారని, జీవోల ద్వారా అభ్యర్థులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేసి, నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలు నిజంగా పారదర్శకంగా జరిగి ఉంట

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story