Chowdepalle: మృత్యుంజయ స్వామి హుండీ లెక్కింపు – రూ.1.75 లక్షల ఆదాయం!
Chowdepalle: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి అభీష్టద మృత్యుంజయ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు. మొత్తం రూ.1,75,032 ఆదాయం వచ్చినట్లు ఈవో రమణ వెల్లడి.
Chowdepalle: మృత్యుంజయ స్వామి హుండీ లెక్కింపు – రూ.1.75 లక్షల ఆదాయం!
Chowdepalle: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి పట్టణంలో వెలసిన అభీష్టద మృత్యుంజయ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఐదు నెలలకు సంబంధించిన సాధారణ హుండీని లెక్కించగా రూ.1,32,219 ఆదాయం వచ్చినట్లు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రమణ తెలిపారు.
అలాగే ఆడికృతిక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీని లెక్కించగా రూ.42,813 ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.దీంతో రెండు హుండీల ద్వారా మొత్తం రూ.1,75,032 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్,అర్చకులు మహేష్,శివకుమార్,రాజా,సిబ్బంది హరిప్రసాద్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story




