Chowdepalle: చౌడేపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి

Chowdepalle: చౌడేపల్లి షిర్డీ సాయిబాబా ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.

MAHESH, PUNGANOOR
Published on: 29 July 2026 3:39 PM IST
Chowdepalle
X

Chowdepalle: చౌడేపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి

చౌడేపల్లి: చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి.

దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగ్గిడి గోపాల్, సోమల సురేష్, రామనాథం నాయుడు, నందకుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story