Chowdepalle: విజయవాణి విద్యాసంస్థల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Chowdepalle: చౌడేపల్లె విజయవాణి విద్యాసంస్థల్లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన విద్యాసంస్థల అధినేత నాయుని చంద్రశేఖర్ మూర్తి.
Chowdepalle: విజయవాణి విద్యాసంస్థల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Chowdepalle: విజయవాణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఐసిఎస్ సి & సి బి ఎస్ సి), చౌడేపల్లె వారి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. “యూనిటీ ఇన్ యువర్ సిటీ ప్రౌడ్ టు బి ఇండియన్Unity ” అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలు దేశభక్తి, జాతీయ సమైక్యత మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నాయుని చంద్రశేఖర్ మూర్తి గారు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం, జాతీయ ప్రతిజ్ఞ మరియు దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థుల మార్చ్‌పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఐ సి ఎస్ సి ప్రైమరీ విద్యార్థుల దేశభక్తి గీతాలాపన, సి బి ఎస్ సి విద్యార్థుల ప్రసంగాలు, ఉపాధ్యాయుల సందేశాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన డంబెల్ డాన్స్/రింగ్స్ ప్రదర్శన, మార్షల్ ఆర్ట్స్, లెజిమ్ ప్రదర్శన విద్యార్థుల క్రమశిక్షణ, సమన్వయం మరియు ప్రతిభను చాటిచెప్పాయి.
ఐ సి ఎస్ సి విద్యార్థులు ప్రదర్శించిన “ఫ్రీడం ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ” అనే సందేశాత్మక నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్వాతంత్ర్యం కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అనే సందేశాన్ని ఈ నాటిక ద్వారా విద్యార్థులు చక్కగా తెలియజేశారు.
అలాగే “యూనిటీ ఇన్ డివేర్సిటీ” సాంస్కృతిక ప్రదర్శన ద్వారా భారతదేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు ఉన్నప్పటికీ మనమంతా ఒకే భారతీయులమనే సందేశాన్ని విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. కోలాటం మరియు ఇతర దేశభక్తి గీతాల ప్రదర్శనలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా విద్యా రంగంలో, క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు మరియు ప్రశంసా పత్రాలను ముఖ్య అతిధులు, పాఠశాల యాజమాన్యం మరియు ఐ సి ఎస్ సి ప్రిన్సిపాల్ శ్రీమతి నాయుని జ్యోతి రాణి మరియు సి బి ఎస్ సి ప్రిన్సిపాల్ శ్రీమతి నాయుని కరుణ పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా అకాడమిక్ అడ్వైజర్ పురుషోత్తమ రెడ్డి గారు ప్రసంగిస్తూ విద్యార్థులకు ముఖ్యమైన సందేశాలు అందించారు. విద్యార్థులు కేవలం మార్కుల కోసం కాకుండా జ్ఞానం, నైపుణ్యం మరియు విలువల కోసం చదవాలని సూచించారు. క్రమశిక్షణ మరియు సమయపాలన విజయానికి మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ అధినేత శ్రీ నాయుని చంద్రశేఖర్ మూర్తి గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దేశభక్తితో పాటు క్రమశిక్షణ, బాధ్యత, మానవతా విలువలు మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం విజయవాణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు తమ విద్య, ప్రతిభ మరియు మంచి ప్రవర్తన ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ICSE & CBSE ప్రిన్సిపాళ్లు శ్రీమతి నాయుని జ్యోతి రాణి మరియు శ్రీమతి నాయుని కరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సిబ్బందిని పాఠశాల యాజమాన్యం అభినందించింది.
“స్వాతంత్ర్యం మన హక్కు మాత్రమే కాదు – అది మన బాధ్యత” అనే సందేశంతో వేడుకలు ముగిశాయి.




