Chowdepalli: ఆడుకుంటుండగా బాలికపై పడ్డ కొబ్బరి చెట్టు.. కాలు విరిగి పరిస్థితి విషమం!

Chowdepalli: పెద్దకొండమరి గ్రామంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక దర్శినిపై పడిన కొబ్బరి చెట్టు. కాలు విరిగి స్థితి విషమించడంతో మదనపల్లె ఆసుపత్రికి తరలింపు.

MAHESH, PUNGANOOR
Published on: 5 July 2026 9:01 PM IST
Chowdepalli
X

Chowdepalli: ఆడుకుంటుండగా బాలికపై పడ్డ కొబ్బరి చెట్టు.. కాలు విరిగి పరిస్థితి విషమం!

చౌడేపల్లి: కొబ్బరి చెట్టు పడి బాలికకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చౌడేపల్లిలో చోటుచేసుకుంది.

మండలంలోని పంచాయతీ కేంద్రం పెద్ద కొండా మరి కి చెందిన నాగరాజ కుమార్తె దర్శిని (7) ఇంటికి సమీపంలోని పూల చెట్టు వద్ద ఆడుకుంటుండగా పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు పడింది ఈ ప్రమాదంలో బాలిక కాలు విరిగిపోయింది.

చుట్టుపక్కల వారు స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఇక్కడ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 108 సేవల ద్వారా మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story