Peddamandyam: మెగా PTM 4.0 లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక సూచనలు!
Peddamandyam: పెద్దమండ్యం మండలం కలిచెర్ల ZPHS లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 4.0.
Peddamandyam: మెగా PTM 4.0 లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక సూచనలు!
Peddamandyam: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం ఎంతో కీలకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.
శుక్రవారం పెద్దమండ్యం మండలం కలిచెర్ల జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాఠశాల నివేదికను ఎంఈఓ చదివి వినిపించారు. అలాగే పాఠశాల విద్యార్థులతో... తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యాశాఖకు భారీగా బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వం విద్యపై ఉన్న నిబద్ధత స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ ప్రధాన ఉద్దేశమన్నారు.
పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన స్థాయి, హోంవర్క్, హాజరు, విద్యా ప్రమాణాలు, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో బహిరంగంగా చర్చించాలని సూచించారు. పాఠశాలలో ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవడానికి పీటీఎం నిర్వహించడం లేదని, విద్యా నాణ్యతను మరింత పెంచేందుకు అవసరమైన అంశాలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు.




