Annamaya: ఎల్‌నినో సవాళ్లకు ప్రకృతి వ్యవసాయమే విరుగుడు.. కలెక్టర్!

Annamaya: కేశాపురంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ఆరుతడి పంటల సాగు

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 30 Jun 2026 3:59 PM IST
Annamaya
X

Annamaya: ఎల్‌నినో సవాళ్లకు ప్రకృతి వ్యవసాయమే విరుగుడు.. కలెక్టర్!

అన్నయ్య: రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రైతులలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలో పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కలెక్టరు పరిశీలించారు.

ముందుగా రైతు ఖదర్ నిషా అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్.

పంటల పరిస్థితిని పరిశీలించి, సాగు విధానం, నీటి వినియోగం, ఖర్చులు, దిగుబడులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

తక్కువ నీటితోనూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు.

అనంతరం విత్తన పెల్లెటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. విత్తనాలకు సహజ పదార్థాలతో పూత పూయడం వల్ల మొలక శాతం పెరగడం, ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల మెరుగుపడడం, తేమ నిల్వ సామర్థ్యం పెరగడం, వేర్ల అభివృద్ధికి దోహదపడడం వంటి ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story