Madanapalle: నీరుగట్టువారిపల్లి టమోటా మార్కెట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు!

Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లి టమోటా మార్కెట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు.

Srinivasulu, Madanapalle
Published on: 19 Jun 2026 12:20 PM IST
Madanapalle
X

Madanapalle: నీరుగట్టువారిపల్లి టమోటా మార్కెట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు!

Madanapalle: మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి టమోటా మార్కెట్ యార్డు వద్ద రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. మార్కెట్‌కు వచ్చే వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడం వల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

ప్రత్యేకించి ఉదయం వేళల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంతో ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story