Boyakonda: భక్తులతో కిటకిటలాడిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం

Boyakonda: ప్రసిద్ధ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పొరుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు.

MAHESH, PUNGANOOR
Published on: 7 Jun 2026 6:48 PM IST
Boyakonda
X

Boyakonda: భక్తులతో కిటకిటలాడిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం

Boyakonda: ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణలో నుంచి విశేష సంఖ్యలో యాత్రికులు బోయకొండకు తరలివచ్చారు.

బోయకొండ మొత్తం భక్తజన సంద్రమైంది ఎన్నడూ లేని విధంగా అమ్మవారి క్యూ లైన్లు గాలిగోపురం దాటి మెట్ల వరకు వచ్చింది దాదాపు మూడు గంటల సమయం అమ్మవారి దర్శనానికి పట్టిందని భక్తులు అన్నారు.

యాత్రికుల వసతి కోసం ఈవో ఉపక కమిషనర్ ఏకాంబరం అనేక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా ఉంటూ క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు ఏర్పాట్లు చేశారు.

అయితే కొండ కింది నుంచి అమ్మవారి సన్నిధానం వరకు ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story