Annamayya: దీపావళి వేళ అప్రమత్తత అవసరం: ఫైర్ ఆఫీసర్ ఆదినారాయణ రెడ్డి
Annamayya: దీపావళి వేళ బాణసంచా దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని, పిల్లల పర్యవేక్షణలో జాగ్రత్తగా టపాసులు కాల్చాలని ఫైర్ ఆఫీసర్ ఆదినారాయణ రెడ్డి సూచించారు.
Annamayya: దీపావళి వేళ అప్రమత్తత అవసరం: ఫైర్ ఆఫీసర్ ఆదినారాయణ రెడ్డి
అన్నమయ్య జిల్లా: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయించే దుకాణాల నిర్వాహకులు, ప్రజలు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని డి.డి.ఆర్ & ఎఫ్.ఓ ఆదినారాయణ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టపాసుల దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు పొందాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
దుకాణాల్లో అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దుకాణాల పరిసరాల్లో పొగతాగడం, నిప్పు వెలిగించడం పూర్తిగా నిషేధించాలని పేర్కొన్నారు. ప్రజలు టపాసులు కాల్చేటప్పుడు పిల్లలను ఒంటరిగా వదలకుండా పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చించాలని తెలిపారు.
ఇళ్లకు, వాహనాలకు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చాలని సూచించారు. చేతిలో టపాసులు పెట్టుకుని కాల్చకూడదని, కాలిన టపాసులు పేలకపోతే తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
టపాసులు కాల్చే ప్రదేశాల్లో నీటి బకెట్లు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని, ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన వాతావరణంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆదినారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.




