Chittoor: తనను చూసి నవ్వాడని తండ్రి గొంతు కోసిన తనయుడు!
Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మాణిక్యరాయునిపల్లెలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న తనను చూసి నవ్వాడన్న కోపంతో తండ్రిని గొంతు కోసి కన్నకొడుకే హత్య చేశాడు.
Chittoor: తనను చూసి నవ్వాడని తండ్రి గొంతు కోసిన తనయుడు!
Chittoor: మద్యం తాగి వచ్చిన తనను చూసి నవ్వాడని తండ్రి గొంతు కోసి హత్య చేసిన కుమారుడి ఉదంతం చిత్తూరుజిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, కత్తిరెడ్డిపల్లె పంచాయతీ, మాణిక్యరాయునిపల్లెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం మేరకు. మాణిక్యరాయునిపల్లెకు చెందిన చెంగారెడ్డి(55)కి జోకేత్రెడ్డి,హేమచంద్రారెడ్డి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు. జోకేత్రెడ్డి మండలంలోని ఎల్లంపల్లె సమీపంలోని కంకర కర్మాగారంలో జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతని భార్య చూడామణి పెనుమూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరు పెనుమూరులో నివాసముంటున్నారు.
జోకేత్రెడ్డి తరచూ మద్యం తాగి భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి మద్యం తాగి రావడంతో భార్య,మామ చెంగారెడ్డికి ఫోన్ చేసి 'మీ కుమారుడు మందు తాగి వచ్చి వేధిస్తున్నాడు వచ్చి బుద్ధి చెప్పి తీసుకెళ్లు అని చెప్పారు. పక్కనే ఉన్న అతని భార్య అక్కడికి వస్తున్నా' అని చెప్పి ద్విచక్ర వాహనపై మాణిక్యరాయునిపల్లెలో ఉంటున్న తండ్రి వద్దకు వెళ్లాడు.
కుమారుడిని చూసి తండ్రి నవ్వడంతో ఆగ్రహం చెందిన జోకేన్రెడ్డి కత్తితో గొంతు కోసి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.




