Madanapalle: మదనపల్లెలో రౌడీషీటర్లకు డీఎస్పీ పావని కౌన్సెలింగ్!
Madanapalle: మదనపల్లె సబ్‌డివిజన్ పరిధిలోని 200 మందికి పైగా రౌడీషీటర్లకు డీఎస్పీ పావని ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో రౌడీషీటర్లకు డీఎస్పీ పావని కౌన్సెలింగ్!
మదనపల్లె: మదనపల్లె సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన సుమారు 200 మందికి పైగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులకు ఆదివారం మదనపల్లె డీఎస్పీ పావని కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో సత్పవర్తనతో మెలగాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆమె సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఎవరైనా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా, సన్మార్గంలో నడుచుకుంటూ మంచి ప్రవర్తన కనబరిస్తే వారిపై ఉన్న రౌడీ షీట్లను కూడా ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె వన్‌టౌన్, టూ టౌన్, తాలూకా, బి.కొత్తకోట సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.




