Punganur: పుంగనూరులో విద్యాసంస్థల బంద్ జయప్రదం!

Punganur: నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీ విద్యార్థులపై దాడికి నిరసనగా పుంగనూరులో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.

MAHESH, PUNGANOOR
Published on: 24 July 2026 9:46 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో విద్యాసంస్థల బంద్ జయప్రదం!

Punganur: నీట్ పేపర్ లీకేజీ కి, 20 తేదీన ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బందును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా మాట్లాడుతూ..

2014 నుండి NDA ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల ఉన్నత విద్యా పోటీ పరీక్షల నిర్వహణ లో 152 పేపర్ లీకులు జరిగాయి అని, దీని వలన కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు. 2024 నుండి ప్రతి సంవత్సరం NEET పేపర్ లీకేజీ జరుగుతున్నా మోదీ ప్రభుత్వం ఈ అక్రమాలకు ఎలాంటి బాధ్యత తీసుకోకుండా లక్షలాది విద్యార్థులకు అన్యాయం చేశారని, అనేక మంది విద్యార్థుల బలన్మరణాలకు కారకులయ్యారని వారు విమర్శించారు.

ఈ అక్రమాలకు, మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, మరణించిన విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాలని, దీనికి కారణమైన NTA ను రద్దు చేసి, ఈ పోటీ పరీక్షలు పగడ్బందిగా నిర్వహించడానికి సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యాసంస్థల బంద్ జయప్రదం చేశారు.

ఢిల్లీ జంతర్మంతర్లో జరుగుతున్న విద్యార్థులు యువకులు యువతులపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్త బందులో భాగంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం నందు కూడా బందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే విద్యాసంస్థల బంద్ లో భాగంగా కళాశాలలో జరుగుతున్న తరగతులు బహిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు మూయించారు .

ఇప్పటికైనా నీట్ ప్రవేశ పరీక్ష లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేని పక్షంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల, మేధావులను కలుపుకొని దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, AISF మాజీ నాయకులు శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షులు అయూబ్,ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి, తరుణ్, హసన్, అయాన్,గని తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story