Puttur: పుత్తూరులో విద్యాసంస్థల బంద్ విజయవంతం!

Puttur: నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీ విద్యార్థులపై దాడికి నిరసనగా పుత్తూరులో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 July 2026 11:07 PM IST
Puttur
X

Puttur: పుత్తూరులో విద్యాసంస్థల బంద్ విజయవంతం!

Puttur: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం పుత్తూరులో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ పుత్తూరు డివిజన్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ నాయకత్వంలో చేపట్టిన ఈ బంద్‌కు సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ డివిజన్ కార్యదర్శి డి. మహేష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ, బంద్‌కు సహకరించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ ఫ్రైడే స్కూల్ యాజమాన్యం తొలుత బంద్‌కు సహకరించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేయగా, అనంతరం యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపించినట్లు తెలిపారు.

2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అనేక ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని, దీని వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో సంస్కరణలు చేపట్టి పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దిలీప్ కుమార్, సాయికిరణ్, గోపి, దినేష్, గోవింద్, సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story