Kanipakam: భక్తులకు పెద్దపీట.. లడ్డు నాణ్యత, అన్నదానంపై ఈఓ సూచనలు!

Kanipakam: స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో ఈఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో సిబ్బందితో సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది.

VASU, PUTTALAPATTU
Published on: 18 July 2026 12:37 AM IST
Kanipakam
X

Kanipakam: భక్తులకు పెద్దపీట.. లడ్డు నాణ్యత, అన్నదానంపై ఈఓ సూచనలు!

కాణిపాకం: శ్రీ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం మీటింగ్ హాలు నందు ఈరోజు దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానంలో పనిచేయు వివిధ విభాగాల సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఆలయంలో సిబ్బందికి భక్తులతో దురుసుగా మాట్లాడకూడదు అని సూచించారు, క్యూలైన్లు నడుపు సిబ్బంది గణేష అని సంబోధించాలని తెలియజేశారు, శానిటేషన్ పరిశుభ్రతను, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏఈఓ, సూపర్డెంట్ సూచించారు, అన్నదానంలో పనిచేయు సిబ్బంది సహనంతో వడ్డించేలా సూచించారు.

లడ్డు పోటు నందు సిబ్బందికి లడ్డు నాణ్యత పై పలు సూచనలు జారీచేశారు, ఇంకా వివిధ విభాగాలలో అందరి సిబ్బందితో అర్చకులు, మరియు వేద పండితులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీఈవో సాగర్ బాబు, ఏ ఈ ఓ లు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, మాధవరెడ్డి, ప్రసాద్, సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story