Chittoor: కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు.. అమరవీరులకు ఘన నివాళి!

Chittoor: చిత్తూరు నగరంలో 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

Chandra Sekhar, Chittoor
Published on: 26 July 2026 4:38 PM IST
Chittoor
X

Chittoor: కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు.. అమరవీరులకు ఘన నివాళి!

చిత్తూర్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా చిత్తూరు జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలోని కార్గిల్ స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి రాఘవులు మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయానికి గుర్తుగా 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటున్నామని తెలిపారు.పాకిస్తాన్ కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం సుమారు రెండున్నర నెలలపాటు ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించిందని చెప్పారు.

ఈ యుద్ధంలో 527 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వారి త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించిన ఆయన, దేశసేవ పట్ల యువతలో స్ఫూర్తి పెంపొందాలని, ఎక్కువ మంది భారత సైన్యంలో చేరి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story