Kanipakam: కాణిపాకం క్షేత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర!

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక ఆలయాన్ని సందర్శించిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

Narsimha Reddy
Published on: 10 Jun 2026 11:50 AM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం క్షేత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర!

చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయక స్వామిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర కి ఆలయ అధికారులు పూర్ణకుంభముతో స్వాగతం పలికారు.

ఉదయం ఐదు గంటలకి పంచామృత అభిషేకంలో పాల్గొన్న మంత్రి. వేద మండపము నందు వేద పండితులు వేదమంత్రాలతో మంత్రి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, స్వామి వారి చిత్రపటాన్ని అందించి, తీర్థప్రసాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనీ నాయుడుతోపాటు, ఆలయ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Narsimha Reddy

Narsimha Reddy

Next Story