Srikalahasti: మార్కెట్ యార్డ్‌లో ఉచిత వైద్య శిబిరం
శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో రెడ్ క్రాస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు.
Srikalahasti
Srikalahasti: ప్రపంచ ఇండియన్ రెడ్ క్రాస్ డే సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ మరియు ఎంజీఎం హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి సుమారు 150 మంది హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు.
శుక్రవారం సంతకు వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు. గుండె, ఎముకలు, స్త్రీ, చిన్నపిల్లల వైద్యం, జనరల్ సర్జరీ నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
వైద్యులు మాట్లాడుతూ, తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు ఓఆర్‌ఎస్, చల్లని పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంజీఎం హాస్పిటల్స్‌లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ వివేక్ చైతన్య తెలిపారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రెస్ క్లబ్, ఎంజీఎం హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులు, వైద్య బృందం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




