Gudur: పేద విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత చదువు.. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్
Gudur: గూడూరులో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
Gudur: పేద విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత చదువు.. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్
Gudur: గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధినేత బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి 17 సంవత్సరాలు పూర్తయిందని,
ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అందించి వారిని ప్రయోజకులను చేయడం జరిగిందని, ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 2,3 తరగతులు చదివే పేద విద్యార్థులను ఎంపిక చేసి ఇంటర్మీడియట్ వరకు వారికి పూర్తిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం విద్యార్థుల ఎంపిక నెల 25.వ తేదీ గూడూరు పట్టణంలో జరుగుతుందని 24వ తేదీ లోపు ఎంట్రన్స్ ఫామ్ ఫిలప్ చేసి అర్హులైన పేద విద్యార్థులు సొసైటీలోని ఫౌండేషన్ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ సమావేశంలో బి.దశరథ రామిరెడ్డి,ఎన్ బాలకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.




