Madanapalle: మదనపల్లెలో భారీ వర్షం: మోకాళ్ళ లోతు నీటిలో రహదారులు
Madanapalle: మదనపల్లెలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Madanapalle: మదనపల్లెలో భారీ వర్షం: మోకాళ్ళ లోతు నీటిలో రహదారులు
మదనపల్లె: మదనపల్లెలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.




