Punganur: చౌడేపల్లిలో 80% సబ్సిడీపై ఉలవ విత్తనాల పంపిణీ!

Punganur: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో 80% సబ్సిడీపై ఉలవ విత్తనాల పంపిణీ.. వివరాలు వెల్లడించిన వ్యవసాయ అధికారి మోహన్ కుమార్.

MAHESH, PUNGANOOR
Published on: 17 Sept 2026 3:20 PM IST
Punganur
X

Punganur: చౌడేపల్లిలో 80% సబ్సిడీపై ఉలవ విత్తనాల పంపిణీ!

Punganur: చౌడేపల్లి మండలంకు ప్రత్యామ్నాయ పంటగా 400 క్వింటాళ్ల ఉలవ విత్తనాలు 80% సబ్సిడీపై కేటాయించారనీ చౌడేపల్లి వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. అన్ని రైతు సేవా కేంద్రాలలో రేపటి నుండి అంటే 18.09.2026 వ తేది నుండి పంపిణీ చేస్తారు. 10 కేజీల బస్తా పూర్తి ధర రూ. 840/-, సబ్సిడీ రూ. 592/- పోను రైతు రూ. 148/- చెల్లించాలి.

10 కేజీలు ఒక ఎకరంలో విత్తుకోవడానికి సరిపోతాయి. విత్తనాలను రసాయన మందులతో విత్తన శుద్ధి చేసి ఉంటారు కావున ఇతర అవసరాలకు వాడకూడదు. ఉలవ విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కు లింక్ అయిన మొబైల్ ఫోన్ తీసుకొని తమ రైతు భరోసా కేంద్రంకు వెళ్లి పొందవచ్చునన్నారు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR