Chittoor: టీడీపీ నేత లోకమ్మ ఇంట్లో దొంగతనం: బంగారం, నగదు అపహరణ!
Chittoor: జి.డి.నెల్లూరు టీడీపీ మహిళా నేత లోకమ్మ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు 70 గ్రాముల బంగారం, రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లారు.
Chittoor: టీడీపీ నేత లోకమ్మ ఇంట్లో దొంగతనం: బంగారం, నగదు అపహరణ!
టిడిపి మహిళా నేత లోకమ్మ ఇంటిలో భారీ చోరీ
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లోకమ్మ ఇంటిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంటిలో ఉన్న 70 గ్రాముల బంగారం 1,50,000 నగదును దోచుకెళ్ళారని బాధిత కుటుంబం తెలిపింది.
లోకమ్మ భర్త రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా విధులునిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకమ్మ మంగళవారం గురు పౌర్ణమి సందర్భంగా దేవస్థానం కు వెళ్లడంతో గుర్తించిన దొంగలు అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోకి వెళ్లి బీరువా తాళాలు సైతం పగలగొట్టి అందులో ఉన్న నగదు, నగలు దోచుకెళ్లారు
ఈ ఘటన చిత్తూరు పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఎన్టీఆర్ కాలనీలో జరిగింది.
బుధవారం ఉదయం
ఈ సమాచారం బయటపట్టడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.




