Puttur: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు.. ఎక్సైజ్ సిఐ హెచ్చరిక
Puttur: పుత్తూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసి, 22 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి.మురళీ మోహన్ తెలిపారు.
Puttur: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు.. ఎక్సైజ్ సిఐ హెచ్చరిక
పుత్తూరు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి.మురళీ మోహన్ తెలిపారు.శనివారం నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద నుండి 22 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మద్యం సేవించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పర్మిట్ రూమ్‌లలో మాత్రమే సేవించాలని, బహిరంగ ప్రదేశాలు, రహదారులు, బెల్ట్ షాపులు తదితర ప్రాంతాల్లో మద్యం సేవించడం నిషేధమని ఆయన స్పష్టం చేశారు. మద్యం చట్టాలను ఉల్లంఘించే వారిపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజలు అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై సమాచారం అందించి సహకరించాలని కోరారు.
Next Story




