Madanapalle: మదనపల్లె మండలంలో తాగునీటి తిప్పలు రోడ్డెక్కిన కాలనీవాసులు

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్యపై ఇందిరమ్మ కాలనీవాసులు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.

Srinivasulu, Madanapalle
Published on: 14 Jun 2026 2:15 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె మండలంలో తాగునీటి తిప్పలు రోడ్డెక్కిన కాలనీవాసులు

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు-1 గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్యతో పాటు రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇందిరమ్మ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ, కాలనీలో మూడు నెలలకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు.

తాగునీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story