Karvetinagar: ఇనుపకంచెలో చిక్కుకుని చుక్కల దుప్పి మృతి!
Karvetinagar: కార్వేటినగరం చింతతోపు వద్ద ఇనుపకంచెలో చిక్కుకుని చుక్కల దుప్పి తీవ్ర గాయం. చికిత్స అందించినా దక్కని ప్రాణం. అటవీ అధికారుల ఆధ్వర్యంలో దహనం.
Karvetinagar: ఇనుపకంచెలో చిక్కుకుని చుక్కల దుప్పి మృతి!
Karvetinagar: చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం చింతతోపు గ్రామ సమీపంలోని శివాలయం వద్ద మామిడి తోపుకు ఏర్పాటుచేసిన ఇనుపకంచెకు చిక్కుకొని మగ చుక్కల దుప్పి గాయపడింది.
కార్వేటి నగరం రేంజ్ పరిధిలోని వి.ఎం పురం బీటుకు చెందిన చింత తోపు సమీపంలో మామిడి తోట లోనికి మగ చుక్కల దుప్పి డాటుతుండగా గాయపడి పడి ఉండడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
తక్షణమే స్పందించిన రేంజర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి హేమ కుమార్ చికిత్స చేయించారు.
అనంతరం అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అడవిలో విడిచిపెడుతున్న సమయంలో మృతి చెందింది. అనంతరం జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి సలహా మేరకు కుప్పనిగుంట వద్ద పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కాల్చి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
FSO లోకేష్, FBO వినోద్
బేస్ క్యాంప్ సిబ్బంది :- హరి, మణి, మేఘనాధం, ఆనంద్, భరత్, నాగ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.




