Madanapalle: మదనపల్లెలో ఉత్సాహంగా 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Madanapalle: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం - ప్రజా సమస్యలు తెలుసుకున్న 32వ వార్డు ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి!

Srinivasulu, Madanapalle
Published on: 23 Aug 2026 1:48 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ఉత్సాహంగా 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో 32వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండిపల్లి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన సూచించారు.

ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story