Punganur: పుంగనూరు చౌడేశ్వరీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో జబర్దస్త్ టీం సందడి!

Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు శ్రీ చౌడేశ్వరీ దేవి దసరా నవరాత్రి ఉత్సవాల్లో జబర్దస్త్ టీం ప్రదర్శించిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

MAHESH, PUNGANOOR
Published on: 19 Oct 2026 6:33 AM IST
Punganur
X

Punganur: పుంగనూరు చౌడేశ్వరీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో జబర్దస్త్ టీం సందడి!

Punganur: శ్రీ సప్త మాంత్రిక సమేత శ్రీ చౌడేశ్వరీ దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో కేక పెట్టించిన జబర్దస్త్ టీం కామెడీ. పంచ్ మీద కామెడీపంచులు డైలాగులు మీద కామెడీ డైలాగులతో జబర్దస్త్ టీం సభ్యులు ఇచ్చిన వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ సప్తమాతృత సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త, ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జబర్దస్త్ టీం సభ్యులచే కామెడీ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

జబర్దస్త్ సభ్యులైన వినోద్ ఆనంద్ శాంతి స్వరూప్ రాజమౌళిలచే ఏకబిగిన మూడు గంటల పాటు హాస్య భరితమైన పలు స్కిట్లు ప్రదర్శించారు. ఎప్పుడు టీవీలలో లేదా ఫోన్లలో మాత్రమే ఇలాంటి ప్రదర్శనను తిలకించే ప్రజలు నేరుగా వారి కామెడీ షోలను చూడడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అత్యద్భుతంగా హాస్యాన్ని పండించిన కళాకారులు వినోద్, రాజమౌళి, ప్రవీణ్, ఆనందులను ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి సత్కరించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR