Madanapalle: జనసేన పార్టీ కమిటీల పదవుల దరఖాస్తు గడువు రేపటితో ముగింపు!

Madanapalle: జనసేన పార్టీ సంస్థాగత కమిటీల పదవుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 3 తో ముగియనున్నట్లు రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ అడపా సురేంద్ర తెలిపారు.

Srinivasulu, Madanapalle
Published on: 2 July 2026 11:26 AM IST
Madanapalle
X

Madanapalle: జనసేన పార్టీ కమిటీల పదవుల దరఖాస్తు గడువు రేపటితో ముగింపు!

మదనపల్లె: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, నగర, గ్రామ పంచాయతీ స్థాయిల్లో పార్టీ పదవుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, ఈ ప్రక్రియకు *జూలై 3 (శుక్రవారం)*తో గడువు ముగియనున్నట్లు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ అడపా సురేంద్ర తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు, యువత, కార్యకర్తలకు సంస్థాగత పదవుల్లో సేవలందించే అవకాశం కల్పించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, నగర, గ్రామ పంచాయతీ స్థాయిల్లోని వివిధ పార్టీ పదవులకు ఆసక్తి, అర్హత కలిగిన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పారదర్శకంగా పదవుల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యం, సేవాభావం ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణకు జూలై 3 (శుక్రవారం) చివరి తేదీ కావడంతో ఇంకా దరఖాస్తు చేయని నాయకులు, కార్యకర్తలు ఆలస్యం చేయకుండా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడపా సురేంద్ర విజ్ఞప్తి చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story