Thamballapalle: బి.కొత్తకోటలో శాశ్వత ఆర్టీసీ బస్టాండ్: రవాణా మంత్రిని కోరిన జనసేన!

Thamballapalle: బి.కొత్తకోటలో శాశ్వత ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని జనసేన నాయకులు వినతిపత్రం అందజేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 22 Jun 2026 11:19 AM IST
Thamballapalle
X

Thamballapalle: బి.కొత్తకోటలో శాశ్వత ఆర్టీసీ బస్టాండ్: రవాణా మంత్రిని కోరిన జనసేన!

Thamballapalle: తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట పట్టణంలో శాశ్వత ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిను సోమవారం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బి.కొత్తకోట పట్టణానికి శాశ్వత ఆర్టీసీ బస్టాండ్‌ను మంజూరు చేయాలని కోరడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం బాత్రూమ్‌లు, తాగునీటి సదుపాయం, బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను తక్షణమే కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పోతుల సాయినాథ్ ఆదేశాల మేరకు బి.కొత్తకోట మండల ప్రధాన కార్యదర్శి పగడాల ప్రసాద్ బాబు, పీటీఎం మండల ప్రధాన కార్యదర్శి అధికారి దేవేంద్ర, చందు రాయల్, కేతగాని నరేంద్ర, ధర్మగాళ్ల ప్రత్యూష, అలకుంట్ల ప్రభావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story