Madanapalle: మదనపల్లెలో జనసేన పార్టీ కీలక సమావేశం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై బుధవారం జనసేన పార్టీ కీలక సమావేశం. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, దారం అనిత హాజరు. పూర్తి వివరాలు

Srinivasulu, Madanapalle
Published on: 29 Sept 2026 11:00 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో జనసేన పార్టీ కీలక సమావేశం!

Madanapalle: రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మదనపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రాజోలు ఎమ్మెల్యే, రాజంపేట పార్లమెంట్ కో-ఆర్డినేటర్ దేవ వరప్రసాద్ సమావేశానికి హాజరుకానున్నారు.

రాజంపేట పార్లమెంట్ కమిటీ సభ్యులు అతికారి కృష్ణ, తాతంశెట్టి నాగేంద్రతో పాటు మదనపల్లెకు చెందిన దారం అనిత కూడా సమావేశంలో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, పార్టీ కార్యాచరణ, అభ్యర్థులు, ఆశావహుల అభిప్రాయాలపై చర్చించనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, ఆశావహులు, జనసేన మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని పార్టీ శ్రేణులు కోరారు. ఈనెల 30 వ తారీకు బుధవారం |మధ్యాహ్నం 2 గంటలకు

వేదిక: సి.ఎస్.ఐ. ఫంక్షన్ హాల్, మిషన్ కాంపౌండ్ పక్కన, మదనపల్లె. మదనపల్లె జనసేన పార్టీ నాయకులు, ఆశావహులు, కార్యకర్తలు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle