Madanapalle: టమాటో మార్కెట్ చైర్మన్‌పై ఆరోపణలను ఖండించిన జనసేన
Madanapalle: టమాటో మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంపై చేసిన ఆరోపణలను జనసేన నేతలు ఖండిస్తూ ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
Madanapalle
Madanapalle: మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాంపై బీఎస్పీ నాయకులు చేసిన ఆరోపణలను జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. AMC డైరెక్టర్ లక్ష్మీపతి టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. టౌన్ సెక్రటరీ నాగవేణి, పద్మావతి మాట్లాడుతూ ఆరోపణలను నిరూపించాలని, గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సమావేశంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Next Story




