Madanapalle: మదనపల్లెలో మానవత్వం.. అనాథ బాలుడికి అండగా నిలిచిన జనసేన
Madanapalle: మదనపల్లెలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడు ముస్తాఫిర్‌ను పరామర్శించిన జనసేన నేతలు. రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేత.
Madanapalle: మదనపల్లెలో మానవత్వం.. అనాథ బాలుడికి అండగా నిలిచిన జనసేన
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన అమీర్, సల్మా దంపతులు జూన్ 14న పుంగనూరు నియోజకవర్గంలోని ఇడిగపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా, వారి కుమారుడు ముస్తాఫిర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఈ విషయం తెలుసుకున్న మదనపల్లె జనసేన పార్టీ యువ నాయకులు తోట కళ్యాణ్, అడపా సురేంద్ర సహస్ర ఆసుపత్రికి వెళ్లి ముస్తాఫిర్‌ను పరామర్శించారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, తక్షణ సహాయంగా రూ.15 వేల నగదు అందజేశారు. అలాగే వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ముస్తాఫిర్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జనసేన నాయకులు ముందుకు వచ్చారు. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం దాతలు తమ వంతు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, జనసేన కార్యకర్తలు నరేంద్ర కుమార్, అజయ్ కుమార్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.




