Madanapalle: జనసేనలో పదవుల కోసం ప్రొఫైల్స్ సేకరణ.. రాజంపేట పార్లమెంట్ కమిటీలో జయ భవ్యకు కీలక బాధ్యత!

Madanapalle: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి పార్టీ పదవుల కోసం ప్రొఫైల్ సేకరణ ప్రారంభం కానుంది.

Srinivasulu, Madanapalle
Published on: 29 Jun 2026 9:06 AM IST
Madanapalle
X

 Madanapalle: జనసేనలో పదవుల కోసం ప్రొఫైల్స్ సేకరణ.. రాజంపేట పార్లమెంట్ కమిటీలో జయ భవ్యకు కీలక బాధ్యత!

మదనపల్లె: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వీర సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం ప్రొఫైల్ సేకరణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన జనసేన సారథుల సమాచార సేకరణ కమిటీలో మదనపల్లెకు చెందిన జయ భవ్య కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

పార్టీ నిర్మాణ బలోపేతం, అర్హులైన కార్యకర్తల వివరాల సేకరణలో ఆమె చురుకుగా వ్యవహరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జయ భవ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసి, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story