Madanapalle: మదనపల్లె జనసేన ఎన్నికల సమన్వయకర్తగా జంగాల శివరాం రాయల్!
Madanapalle: మదనపల్లె నియోజకవర్గ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా జంగాల శివరాం రాయల్ నియామకం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన శివరాం.
Madanapalle: మదనపల్లె జనసేన ఎన్నికల సమన్వయకర్తగా జంగాల శివరాం రాయల్!
Madanapalle: జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కమిటీల్లో మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు అవకాశం కల్పించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తున్నానని జంగాల శివరాం రాయల్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి తన శక్తికి మించి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు.




