Madanapalle: ఘనంగా టీడీపీ నేత కందికట్ల జయ బర్త్‌డే వేడుకలు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు మిట్టలో టీడీపీ యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Madanapalle: ఘనంగా టీడీపీ నేత కందికట్ల జయ బర్త్‌డే వేడుకలు!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు మిట్ట హనుమాన్ మగ్గాల కాలనీలో టీడీపీ యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
టీడీపీ సీనియర్ నాయకులు కట్ట లక్ష్మీనారాయణ, జై భీమ్ నాయకులు కొన భాస్కర్, మళ్ళీ, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి కందికట్ల జయకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
జయ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కందికట్ల జయ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, ఆదేప్ప, చంద్రారెడ్డి తదితరులు పాల్గొని కందికట్ల జయకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది




