Gudipala: పేయనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జయచంద్ర నాయుడు నామినేషన్!

Gudipala: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పేయనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆశీస్సులతో జయచంద్ర నాయుడు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 22 Nov 2026 8:41 PM IST
Gudipala
X

Gudipala: పేయనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జయచంద్ర నాయుడు నామినేషన్!

చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పేయనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జయచంద్ర నాయుడు నామినేషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఆదివారం పేయనపల్లి గ్రామ సచివాలయంలో తన మద్దతుదారులతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతో పాటు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు, సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పేయనపల్లి గ్రామ ప్రజలు తనకు మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జయచంద్ర నాయుడు విజ్ఞప్తి చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor