Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జింకా వెంకట చలపతి!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున జింకా వెంకట చలపతి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఆశీస్సులతో ముందుకు.

Srinivasulu, Madanapalle
Published on: 14 Oct 2026 10:20 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జింకా వెంకట చలపతి!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జింకా వెంకట చలపతి పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం లభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జింకా వెంకట చలపతికి అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తూ, ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle