Kadiri: జర్నలిస్టు హత్యపై కదిరిలో నిరసన

Kadiri: ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యపై కదిరిలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి చర్యలు కోరారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 29 April 2026 12:08 PM IST
Kadiri
X

Kadiri

Kadiri: చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై కదిరిలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విలేకరిని హత్య చేసిన రౌడీషీటర్ తమీమ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని జర్నలిస్టులు కోరారు.

ఈ సందర్భంగా కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామికు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల భద్రతపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

పత్రికా ప్రతినిధుల రక్షణకు సమగ్ర విధానాలు రూపొందించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story